తెలుగు వారికి స్వాగతం.. సుస్వాగతం........వందనం... అభివందనం....

Friday 15 April 2011

మీకు ఆ అమ్మాయి అంటే ఇష్టం లేదా?....లేక అసలు పెళ్ళే ఇష్టం లేదా?...

(చదవండి.. తలా తోకా లేనిదని అన్యదా భావించకుండా మీ అభిప్రాయం చెప్పండి...)



"మీకు ఆ అమ్మాయి అంటే ఇష్టం లేదా?....లేక అసలు పెళ్ళే ఇష్టం లేదా?..."


రెండూ


అంటే ఎవరినైనా ప్రేమించారా?


మీకు తెలీదా?


అంటే మీరు నన్నింకా ప్రేమిస్తున్నారా?  మీ మనసులో నేనింకా ఉన్నానా?


ఇంకా బ్రతికే ఉన్నవా? అని అడుగుతున్నారు మీరు.  ఆ విషయం ఇప్పుడు గుర్తుకు తెచ్చుకోవడం అనవసరం.  దాని వల్ల లాభాల కన్నా అనర్దాలే ఎక్కువ.


గుర్తు తెచ్చుకోవడం మనకవసరం లేకపోయినా మన చుట్టూ ఉన్న సమాజానికి అవసరం.


కావచ్చు.


నువ్వు పెళ్ళి చేసుకోకపోవడానికి కారణం నేనే అంటున్నారు.  నువ్వు నా మీద పెంచుకున్న ప్రేమే కారణం అంటున్నారు.  ప్లీజ్ మీరు ఆ అమ్మాయిని పెళ్ళి చేసుకోండి.


చూడండి! నాపెళ్ళి అనేది  నాకు మాత్రమే సంబంధించిన విషయం.  నా పెళ్ళి నాకోసమే చేసుకుంటాను.అంతేకాని, వేరే ఎవ్వరి కోసం కాదు.  మనసులో ఒక అమ్మాయి ని ఉంచుకుని మరో అమ్మాయిని పెళ్ళి చేసుకోవడం నాకిష్టం లేదు.  ఈ విషయం లో నిర్ణయం తీసుకునే అధికారం నాకుందనుకుంటాను.....


నేను చెప్పినా వినరా?


మీరు కాబట్టే ఇంకా ఇంతసేపు మాట్లాడుతున్నాను.  అయినా నాకు మీరంటే ఉండే ఇష్టం ఎప్పటికీ ఇలాగే ఉంటుంది.  మిమ్మల్ని ఇష్టపడి, మళ్ళీ వేరొకరిని ఇష్టపడితే అది ప్రేమ అనింపించుకోదు.


మీ నిర్ణయం మార్చుకోలేరా?


మాటిమాటికి మార్చుకునేది నిర్ణయం అవదు. అయినా నేను ఒకసారి నిర్ణయం తీసుకున్నాక దాన్ని మార్చుకోను.ఒక విషయం... జీవితంలో ఎవరైనా ఒక్కరి ని మాత్రమే నిజంగా ప్రేమించగలరు. దయ చేసి వెళ్ళిపొండి.  మళ్ళీ నాకు కనబడకుండా వెళ్ళిపొండి.







2 comments:

  1. మాటి మాటికీ మార్చుకునేది నిర్ణయం కాదు అన్నది తప్పేమో. బాట్ అది ఇక్కడ అసందర్భమే

    ప్రేమ ఒక భావన
    పెళ్ళి ఒక చర్య

    పెళ్ళికి పరమావదులూ, ప్రాతిపదికలూ ఎవరి నెలవుల బట్టి వాళ్లకు.

    అబ్బాయికి పెళ్ళి ప్రాతిపదిక ప్రేమ "మాత్రమె" అని అనిపిస్తోంది. ఎవరి ప్రాతిపదికల మీదే వాళ్ళ నిర్ణయాల, నడకలూ. అలాటి మగాడు సర్దుకుపోయి మరే స్త్రీతో ముడిపడినా ఇద్దరు జీవితాలు నాశనమే. అలా కాకపోయినా కనీసం అబ్బాయిది. Because he has this strong belief that marriage should not be without love.

    ప్రేమ అనే ఆవేశం, భావోద్వేగం కొంత కాలం తరవాత లేకపోయినా బుద్దిపూర్వకంగా వేరే వారిని పెళ్ళి చేసుకోకపోవటం ఈ కాలంలో బలహీనతే సమాజానికి కాదనను. కాని తరచి చూస్తె మనసుకు (ప్రేమ/భావోద్వేగం=మనసు అని equate చేసేస్తున్నా ఇక్కడ) మాత్రమేనా ప్రేమించే హక్కు బుద్ధికి (బుద్ది = ఆలోచన అన్నది ఇక్కడి equation) లేదా అన్న ప్రశ్న వస్తుంది.

    బుద్ది ఎందుకు ప్రేమించకూడదు? మనసులో ఒకప్పటి, అంటే ఆ ప్రేమోద్వేగంలో ఉన్నప్పటి హాయి లేకపోయినా "తనను నా భార్య అనుకున్నా తను నా దగ్గర లేకపోయినా తను నా భార్యే" అని ఎందుకు అనుకునే హక్కు బుద్ధికి లేదు? ఇలాటి "బుద్ది ప్రేమను" మంకుతనం అని ఎందుకు కించపరచటం?

    కాంచన సీతను పక్కన కూర్చోపెట్టుకున్నాడు కాబట్టే మర్యాదా పురుషోత్తముడు అయ్యాడు రాముడు. రాముడు చేసాడని ఏకపత్నీవ్రతానికి అంత పెద్ద హోదా ఉండకూడదు సమాజంలో రాముడు చేసి చూపెట్టాడు కాబట్టి అంత పెద్దది కూడా సాధ్యమే అన్నడి అసలైన తీరు. ఇక్కడ ఆ అబ్బాయి చేస్తున్నదదే. ఎందుకు అతనిని నిరుత్సాహపరచాలి?

    కాలం వేదవతిలా ఇంకో సీతమ్మ రూపం ధరించి వస్తుందేమో ఈ రామునికి. అంతవరకూ అతని వారందరూ అతని ఆదర్శాన్ని ప్రోత్సహించకపోయినా పర్లేదు కాని కించపరచటం నిరుత్సాహపరచటం చేయకపోతే మీ రామునికి తొందర్లోనే తన సీత దొరికే అవకాశం ఎక్కువ. అలా కాదని అతని ఆదర్శాన్ని, వ్యక్తిత్వాన్నీ పక్కనపెట్టి అలవాటు చొప్పునో, ఆచారం చొప్పునో మనసులేని పెళ్ళి చేసుకోమన్నారో తాను శూర్పణఖ అయి, తనే లక్షమణుడై తనే తన ముక్కూ చెవులూ కోసేసుకుంటాడు జాగ్రత్త వీలుంటే. ఇక కాలం ఏ స్వయవరం ప్రకటించినా ఆ వికారాన్ని చూసి ఆమడ దూరం పరిగేత్తాల్సిందే. People fight and their resistance increases, if they are forced to do something against their core beliefs and they would not hesitate to turn against themselves passive aggressively. Be careful of pushing him too much.

    సింపుల్గా చెప్పాలంటే....అతని గాయం మానె అవకాశం ఉంటె అతనే ఆ అవకాశాన్ని గుర్తించి తీసుకుంటాడు. అంతవరకూ ఇందులోనే గాయమే వరం.Just leave him.

    ReplyDelete
  2. మీ టపాకు ఇంకా విపులమైన సమాధానం టపా రూపంలో నా బ్లాగులో

    http://drbr1976.blogspot.com/2011/04/blog-post_5060.html

    ReplyDelete

దయచేసి మీ వ్యాఖ్యను తెలుగులో వ్రాయండి. ఈ బ్లాగు గురించి గానీ, వేరే బ్లాగుల గురించి గానీ, బ్లాగర్ల గురించి గానీ అనుచిత, అసందర్భ, అభ్యంతరకరమైన వ్యాఖ్యలు ఇక్కడ వ్రాయవద్దని మనవి.